దుల్కర్ సల్మాన్, సూర్యాలతో మల్టీస్టారర్ తీస్తున్న కేజిఎఫ్ మేకర్స్

KGF Producers: క్రేజీ మల్టీ స్టార్లర్ ప్లాన్ చేస్తున్న కే జి ఎఫ్ నిర్మాతలు

Sriveni Erugu
Updated on: 13 July 2022 4:11 PM IST
KGF Makers Making a Multistarrer Movie with Dulquer Salmaan and Suriya
X

దుల్కర్ సల్మాన్, సూర్యాలతో మల్టీస్టారర్ తీస్తున్న కేజిఎఫ్ మేకర్స్

KGF Producers: ఈ మధ్యకాలంలో ప్యాన్ ఇండియా సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోలు కూడా మరిన్ని ప్యాన్ ఇండియన్ సినిమాలతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. అందులో ప్రశాంత్ నీల్ దర్సకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న "సలార్" కూడా ఒకటి.

శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కేజీఎఫ్ నిర్మాతలు విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మలయాళం స్టార్ పృథ్వీరాజ్ కుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక ఈ సినిమా తర్వాత హోంబలే ఫిలిమ్స్ వారు మల్టీ స్టారర్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సూర్య మరియు దుల్కర్ సల్మాన్ లతో ఒక క్రేజీ మల్టీ స్టార్ సినిమాని తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. "ఆకాశమే నీ హద్దురా" సినిమా ఫేమ్ సుధా కొంగర ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారట. ఈ ప్రాజెక్టు గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది సమాచారం. ఇకపోతే సూర్య ప్రస్తుతం తమిళ్ లో బాలా దర్శకత్వంలో "వనంగాన్" అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు, తెలుగులో "అచలుడు" గా విడుదల కాబోతోంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story