"నేను మందుకి బానిసని" అంటున్న కే జి ఎఫ్ డైరెక్టర్

* "నేను మందుకి బానిసని" అంటున్న కే జి ఎఫ్ డైరెక్టర్

admin1
Updated on: 12 April 2022 7:00 PM IST
KGF Director Prashanth Neel Says I am Addicted to Alcohol
X

 "నేను మందుకి బానిసని" అంటున్న కే జి ఎఫ్ డైరెక్టర్

Prashanth Neel: కన్నడ బ్లాక్ బస్టర్ సినిమా "కే జి ఎఫ్ చాప్టర్ 1" సినిమా తో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు. కన్నడలో మాత్రమే కాక తెలుగులో కూడా ప్రశాంత్ నీల్ ఇప్పుడు సుపరిచితుడు అయ్యాడు. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ "సలార్" అనే సినిమా కూడా తీస్తున్నారు.

అయితే తాజాగా కే జి ఎఫ్ చాప్టర్ టు చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్. దీనికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రశాంత్ అన్న మాటలు ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. "మీరు నా ఇంటర్వ్యూ ని కట్ చేయను అని ప్రమాణం చేస్తే నేను మీకు ఒక విషయం చెబుతాను.

నేను ఎప్పుడైనా మందు కొట్టకే స్క్రిప్ట్ రాస్తాను. మందు తో వచ్చే కిక్ కంటే కథ రాస్తున్నప్పుడు కూడా అదే స్థాయిలో ఇక్కడ నాకు కిక్ వస్తుంది" అని చెప్పుకొచ్చారు ప్రశాంత్ నీల్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రభాస్ తో సలార్ సినిమా పూర్తి అయిన తర్వాత తన తదుపరి సినిమా ఎన్టీఆర్ హీరోగా చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ నీల్.

admin1

admin1

Next Story