KGF Chapter 2: కేజీఎఫ్ 2 ఓటీటీ డేట్ ఫిక్స్..

KGF 2 OTT Release Date: భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'కేజీయఫ్‌ 2' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

Arun Chilukuri
Published on: 16 April 2022 2:54 PM IST
KGF Chapter 2 OTT Release Date Confirmed
X

KGF Chapter 2: కేజీఎఫ్ 2 ఓటీటీ డేట్ ఫిక్స్..

KGF 2 OTT Release Date: భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'కేజీయఫ్‌ 2' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కన్నడ రాక్ స్టార్ యశ్‌ యాక్షన్‌కి, ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు.. దేశవ్యాప్తంగా 'కేజీయఫ్‌ 2' ఎన్నో రికార్డులను కొల్లగొడుతోంది. యష్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌ చేశాడు.

ఇదే సమయంలో 'కేజీయఫ్‌' అభిమానులకు ఫుల్‌ కిక్‌ ఇచ్చే వార్త ఒక్కటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారట.మే 13 న అంటే థియేటర్లలో విడుదలైన 4 వారాల్లోనే ఓటీటీలోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్‌ ప్రైమ్‌లో కేజీఎఫ్ 2 స్ట్రీమింగ్‌ అయ్యేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వార్తలపై మూవీ యూనిట్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ సినిమా అప్పుడే ఓటిటిలో విడుదల చేయబోరని యష్ అభిమానులు అంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story