మొట్టమొదటి కన్నడ సినిమాగా రికార్డు సృష్టించిన "కే జి ఎఫ్: చాప్టర్ 2"

KGF Chapter 2 Hindi Version Crosses Rs 300 Crore
x

మొట్టమొదటి కన్నడ సినిమాగా రికార్డు సృష్టించిన "కే జి ఎఫ్: చాప్టర్ 2"

Highlights

మొట్టమొదటి కన్నడ సినిమాగా రికార్డు సృష్టించిన "కే జి ఎఫ్: చాప్టర్ 2"

KGF Chapter 2 Collections: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా కి సీక్వెల్ గా విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలైంది. ఇది కేవలం కన్నడ లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా రికార్డుల వర్షం కురిపిస్తోంది. తాజాగా హిందీలో కూడా ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్లను నమోదు చేసుకొని సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటిదాకా హిందీ లో ఇలాంటి ఘనతను సాధించిన మొట్టమొదటి కన్నడ సినిమా గా "కే జి ఎఫ్: చాప్టర్ 2" చరిత్ర సృష్టించింది.

ఇక 300 క్లబ్బులు ఉన్న టాప్ టెన్ సినిమాల జాబితా ఇదే:

2014 - పీకే

2015 - బజరంగీ బైజాన్

2016 - సుల్తాన్, దంగల్

2017 - బాహుబలి 2, టైగర్ జిందా హై 2018 - పద్మావత్, సంజు

2019 - వార్

2022: కే జి ఎఫ్: చాప్టర్ టు

దాదాపు అన్ని హిందీ సినిమాలు ఉండగా కేవలం బాహుబలి 2 మరియు కే జి ఎఫ్ 2 సినిమాలు మాత్రమే 300 కోట్ల క్లబ్లో చేరాయి. ఇక ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ 350 కోట్లకు అమ్ముడయ్యాయి. విడుదలైన వారానికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ ను కూడా చేరిపోయింది. బాలీవుడ్ నటులు సంజయ్ దత్ మరియు రవీనాటాండన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories