కేజీఎఫ్ ఆల్‌టైమ్ రికార్డు.. ప్రభాస్, పవన్ రికార్డులు బ్రేక్

KGF Box Office Collections: భారీ అంచనాల మధ్య "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమాకి సీక్వెల్ అయిన "కే జి ఎఫ్: చాప్టర్ 2" నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

Arun Chilukuri
Updated on: 15 April 2022 6:30 PM IST
KGF Chapter 2 Box Office Nizam Collections Day 1
X

కేజీఎఫ్ ఆల్‌టైమ్ రికార్డు.. ప్రభాస్, పవన్ రికార్డులు బ్రేక్

KGF Box Office Collections: భారీ అంచనాల మధ్య "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమాకి సీక్వెల్ అయిన "కే జి ఎఫ్: చాప్టర్ 2" నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కేజీఎఫ్‌ ఛాప్టర్‌2. 2018లో విడుదలైన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో హిరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించింది. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ లతోపాటు ప్రకాష్‌రాజ్, రావు రమేష్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి స్పందనను అందుకున్న ఈ మూవీకి ఓవరాల్‌గా మంచి టాక్ వచ్చింది.

మూవీకి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని చోట్లా మంచి స్పందన దక్కింది. అయితే, అన్ని ఏరియాల కంటే నైజాంలో మరింత ఎక్కవ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా అక్కడ మొదటి రోజు ఏకంగా రూ. 9.68 కోట్లు కలెక్ట్ అయ్యాయి. 'KGF Chapter 2' నైజాంలో మొదటి రోజు అనూహ్యంగా రూ. 9.68 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా అక్కడ ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో ఐదో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ సాహో రూ. 9.41 కోట్లు, బాహుబలి 2 రూ. 8.90 కోట్లు, వకీల్ సాబ్ రూ. 8.75 కోట్లు రికార్డును దాటేసింది. ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ రూ. 23.35 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story