'కేజీఎఫ్ 2' సెన్సేషన్..7 రోజుల్లో 700 కోట్లు.!

KGF Chapter 2 Box Office Collection Day 7
x

'కేజీఎఫ్ 2' సెన్సేషన్..7 రోజుల్లో 700 కోట్లు.!

Highlights

KGF Collections: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో నటించిన సినిమా "కే జి ఎఫ్: చాప్టర్ 1".

KGF Collections: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో నటించిన సినిమా "కే జి ఎఫ్: చాప్టర్ 1". మామూలు అంచనాల మధ్య విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను కన్నడ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసింది. కన్నడ "బాహుబలి" గా పేరు సంపాదించి ఈ సినిమా ఒక టైటిల్ గా కంటే ఒక బ్రాండ్ గా మారింది. అలాంటి కల్ట్ సినిమాకి సీక్వెల్ గా "కే జి ఎఫ్: చాప్టర్ 2" ఈమధ్యనే థియేటర్ లలో విడుదల అయ్యి అనుకున్న స్థాయి కంటే ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది.

"కే జి ఎఫ్ చాప్టర్ 1" రికార్డులను ఈ సినిమా తిరగరాస్తుంది అని ట్రేడ్ వర్గాలు ఎప్పటినుండో విశ్లేషిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా కలెక్షన్ల గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విడుదలైన ఏడు రోజుల్లోనే ఈ సినిమా 700 కోట్ల క్లబ్ లో చేరిపోయి ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చింది. మొదటి వారంలోనే భారీ కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా "బాహుబలి 2" తర్వాత రెండవ స్థానాన్ని దక్కించుకుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories