మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 సంచలనం

KGF Chapter 2: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 15 April 2022 2:24 PM IST
KGF Chapter 2 Box Office Collection Day 1
X

మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 సంచలనం

KGF Chapter 2: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమాకి సీక్వెల్ అయిన "కే జి ఎఫ్: చాప్టర్ 2" నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి స్పందనను అందుకున్న ఈ మూవీకి ఓవరాల్‌గా మంచి టాక్ వచ్చింది. అలాగే, రివ్యూలు కూడా చాలా పాజిటివ్‌గా వచ్చాయి. ఈ సినిమా ఫలితంతో అటు హీరో ఫ్యాన్స్.. ఇటు చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉందని చెప్పొచ్చు.

ఈ సినిమా మొదటి రోజే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 మొదటి రోజే రూ. 130 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అంటే… ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ అని తెలుస్తోంది. కేజీఎఫ్ హిందీ వెర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 50 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే.. తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ 2 మూవీ రూ. 33 కోట్లు రాబట్టింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళలో మొత్తం కలిపి రూ. 50 కోట్లు వసూలు చేసిందట. మొత్తానికి దేశవ్యా్ప్తంగా కేజీఎఫ్ 2 కలెక్షన్స్ రూ. 150 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story