తెలుగు బ్లాక్ బస్టర్ ల లైఫ్ టైం కలెక్షన్లు బద్దలు కొట్టిన కేజిఎఫ్...

KGF Breaking Records of Telugu Blockbuster Movies Lifetime Collections | Live News
x

తెలుగు బ్లాక్ బస్టర్ ల లైఫ్ టైం కలెక్షన్లు బద్దలు కొట్టిన కేజిఎఫ్...

Highlights

KGF Records: భారీ కలెక్షన్లు నమోదు చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా భారత సినీ చరిత్రలోనే వెయ్యి కోట్లకు..

KGF Records: రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విడుదలైన "కే జి ఎఫ్ చాప్టర్ 1" బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా "కే జి ఎఫ్: చాప్టర్ 2" థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు వర్షం కురిపించింది. భారీ కలెక్షన్లు నమోదు చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా భారత సినీ చరిత్రలోనే వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన నాలుగవ సినిమాగా రికార్డు సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

సినిమా విడుదలైన పదిహేను రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు నమోదు చేసిన సాహో, సరిలేరు నీకెవ్వరు, రంగస్థలం, అల వైకుంఠపురం లో, మరియు భీమ్లా నాయక్ సినిమాల ఫైనల్ కలెక్షన్స్ ను సైతం దాటేసింది. ఇప్పటికి ఇంకా ఈ సినిమా థియేటర్లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక రానున్న రోజుల్లో "కే జి ఎఫ్: చాప్టర్ 2" ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మరోవైపు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. టైగర్ జిందా హై, పీకే, సంజు వంటి సినిమాల లైఫ్ టైం కలెక్షన్లను దాటేసింది ఈ సినిమా.

Show Full Article
Print Article
Next Story
More Stories