Prabhas: ప్రభాస్‌తో స్టెప్పులేయనున్న 'కేజీఎఫ్' బ్యూటీ

KGF beauty to dance with Prabhas?
x

ప్రభాస్ & శ్రీనిధి శెట్టి 

Highlights

Prabhas: ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Prabhas: టాలీవుడ్‌లో పేరు సంపాదించిన కన్నడ సినీ నటీమణులలో శ్రీనిధి శెట్టి ఒకరు. రాకింగ్ స్టార్ యాష్ నటించిన 'కేజీఎఫ్: చాప్టర్ 1' అనే సూపర్ హిట్ చిత్రంతో ఈ నటి పేరు పొందింది.

మిస్ సుప్రానేషనల్ 2016, మాజీ మోడల్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ 'కేజీఎఫ్: చాప్టర్ 2' తో ముందుకు రానుంది. ఇది 'కేజీఎఫ్: చాప్టర్ 1' సీక్వెల్ గా రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రం 'సలార్' కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో జతకట్టనున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రంలోని ఒక ప్రత్యేక పాటలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవలే ఆమెను మూవీ యూనిట్ సంప్రదించారంట.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ప్రస్తుతానికి విడుదల కాలేదు. శ్రీనిధి ప్రభాస్‌తో కలిసి డ్యాన్స్ చేయడానికి అంగీకరిస్తారా లేదా చూడాలి మరి. ఏప్రిల్ 2022 లో రిలీజ్ కానున్న ఈ సలార్ సినిమాలో శ్రుతి హసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories