logo
సినిమా

KGF 3 Announced: మార్వెల్‌ ఫ్రాంచైజీ తరహాలో 'కేజీఎఫ్‌ 3'

KGF 3 is Like Marvel kind of universe Says KGF Producer
X

KGF 3 Announced: మార్వెల్‌ ఫ్రాంచైజీ తరహాలో 'కేజీఎఫ్‌ 3'

Highlights

Vijay Kiragandur About KGF 3: "కే జి ఎఫ్" సినిమా తో ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ను అందుకున్నారు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

Vijay Kiragandur About KGF 3: "కే జి ఎఫ్" సినిమా తో ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ను అందుకున్నారు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ డైరెక్టర్ "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా తో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రశాంత్ నీల్ త్వరలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా "సలార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హొంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించిన ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ఇచ్చారు విజయ్.

"ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ 35 శాతం పూర్తయింది. తదుపరి షెడ్యూల్ వచ్చేవారం సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతోంది. ఆ తరువాత కే జి ఎఫ్ 3 ప్లాన్ చేస్తున్నాం. 2024 లో కే జి ఎఫ్ 3 విడుదల అవుతుంది. కేజిఎఫ్ ను మార్వెల్ యూనివర్స్ లాగా మార్చాలని అనుకుంటున్నాం" అని చెప్పుకొచ్చారు విజయ్‌ కిరంగదూర్‌. మరోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

Web TitleKGF 3 is Like a Marvel kind of universe Says KGF Producer
Next Story