KGF-2: సంజయ్ దత్ బర్త్ డే స్పెషల్ "అధీర"

Sandeep Reddy
Published on: 29 July 2021 1:06 PM IST
KGF 2 Movie Team Released Sanjay Dutt Adheera Poster on His Birthday
X

"కేజీఎఫ్ 2" "అధీర"  పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)

KGF-2: కేజీఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరో యష్ ఆ సినిమాకి రెండో భాగం షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నాడు. సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ నటులు ఈ చిత్రంలో నటిస్తుండటంతో అటు హిందీలో కూడా ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరిగింది. తాజాగా గురువారం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్భంగా "కేజీఎఫ్ 2" చిత్ర యూనిట్ "అధీర" పోస్టర్ ని రిలీజ్ చేసి విష్ చేశారు. ఈ సినిమాలో సంజయ్ దత్ "అధీర" అనే విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న "కేజీఎఫ్ 2" చిత్రానికి ప్రముఖ నిర్మాణ సంస్థ హంబల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.

KGF 2 New Poster - Adheera

కేజీఎఫ్ 2 చిత్రంతో పాటు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న "సలార్" అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక జూలై 29న 62వ ఏటా అడుగుపెట్టిన సంజయ్ దత్ కి తన భార్య మాన్యత దత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన భర్తని ఎవరైతే తమ స్వార్ధం కోసం వాడుకోవాలనుకునే వ్యక్తుల నుండి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. మరోపక్క సంజయ్ దత్ కేజీఎఫ్ 2 సినిమాతో పాటు బాలీవుడ్ లో పృధ్వీరాజ్, భూజ్ చిత్రాలలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story