"కే జి ఎఫ్: చాప్టర్ 2" ఎడిటర్ వయసు ఎంతో తెలుసా?

KGF 2 Editor: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 13 April 2022 10:00 PM IST
KGF 2 Editor Ujwal Kulkarni Is Just 19 Year Old
X

"కే జి ఎఫ్: చాప్టర్ 2" ఎడిటర్ వయసు ఎంతో తెలుసా?

KGF 2 Editor: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమాకి సీక్వెల్ అయిన "కే జి ఎఫ్: చాప్టర్ 2" రేపు అనగా ఏప్రిల్ 14, 2022న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. "కే జి ఎఫ్ చాప్టర్ 1" రికార్డులను ఈ సినిమా తిరగరాస్తుంది అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్ గా పనిచేశారు. అయితే అతని వయస్సు కేవలం 19 ఏళ్లు మాత్రమే. గతంలో షార్ట్ ఫిలిమ్స్ మరియు ఫ్యాన్ ఎడిట్ లు చేసే ఉజ్వల్ పనితనం చూసి ప్రశాంత్ చాలా బాగా ఇంప్రెస్ అయ్యాడట. అందుకే "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా కి ఎడిటర్ గా పెట్టారు ప్రశాంత్ నీల్. "కే జి ఎఫ్ చాప్టర్ 2" ట్రైలర్ చూస్తేనే ఉజ్వల్ ప్రతిభ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. ఇంత చిన్న వయసులోనే సినిమాకి ఎడిటర్ గా పని చేసే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం. టాలెంట్ కి కూడా వయసుతో పనిలేదని ఉజ్వల్ కులకర్ణి చూస్తేనే తెలుస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story