"కేజీఎఫ్" సక్సెస్ ప్రభాస్ కి తలనొప్పిగా మారిందా..?

KGF 2 Burden On Prabhas
x

"కేజీఎఫ్" సక్సెస్ ప్రభాస్ కి తలనొప్పిగా మారిందా..?

Highlights

Prabhas: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా విడుదలైన "కేజీఎఫ్ 2" ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది.

Prabhas: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా విడుదలైన "కేజీఎఫ్ 2" ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లని నమోదు చేసుకుంది. బాలీవుడ్ లో ఏకంగా రూ. 400 కోట్లకు మించి వసూళ్లు చేసిన ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి ఏకంగా 1250 కోట్లు వసూళ్లని రాబట్టి రికార్డు సృష్టించింది.

అయితే ఇప్పడు అదే ప్రభాస్ కు పెద్ద తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. "కేజీఎఫ్ 2" కలెక్షన్లతో ట్రెండ్ సెట్ చేసింది. దీంతో ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్రభాస్ మూవీపై మరింత ప్రెషర్ పడుతోంది. "కేజీఎఫ్" ఫ్రాంచైజ్ తెరకెక్కించిన అదే దర్శకుడి నుంచి రానున్న "సలార్" పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దీంతో ప్రభాస్ కు ఆ అంచనాలు అందుకోవడం పెద్ద సవాల్ గా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి.

పైగా "కేజీఎఫ్ 2" తో పోలిస్తే "సలార్" భారీ స్థాయిలో తెరకెక్కుతోంది కాబట్టి అంతకు మించిన విజయాన్ని సాధించాల్సి వుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అయితే లార్జర్ దాన్ లైఫ్ సినిమాగా రూపొందుతున్న "సలార్" వచ్చే సమ్మర్ కు థియేటర్లలోకి రావడం జరిగే పని కాదని, 2024 లోనే ఈ సినిమా విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఆలస్యం కూడా ప్రభాస్ ను కలవరపెడుతున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories