Kurup Movie: కోర్టు నోటీసులు అందుకున్న "కురుప్" సినిమా నిర్మాతలు

Kerala High Court Sent Notices to Kurup Movie Producers | Cinema News Today
x

ఇబ్బందుల్లో ఇరుక్కున్న దుల్కర్ సల్మాన్ సినిమా (ఫైల్ ఫోటో)

Highlights

* దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో సుకుమార్ కురుప్ పాత్రలో కనిపించనున్నారు.

Kurup Movie: దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన "కురూప్" అనే సినిమా ఈ మధ్యనే విడుదల అయింది. క్రైమ్ డ్రామా గా మన ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది కానీ తాజాగా ఈ చిత్రం ఇపుడు ఇబ్బందుల్లో ఇరుక్కుంది.

నిజానికి ఈ కథ క్రిమినల్ కూరూప్ సుకుమార్ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. కోర్టు ఈ సినిమా విడుదలను ఆపివేయాలని అనుకోడానికి ముందే సినిమా మీద పిఐఎల్ ఫైల్ అయింది. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు, స్టేట్ గవర్నమెంట్, ఇంటర్పోల్ మరియు చిత్ర నిర్మాతలకు నోటీసులు కూడా పంపించడం జరిగింది. కానీ కోర్టు మాత్రం సినిమా విడుదల పై ఎలాంటి స్టే ఆర్డర్ వేయలేదు. దీంతో అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదలైంది.

దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో సుకుమార్ కురుప్ పాత్రలో కనిపించనున్నారు. 1980ల బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథ కూరూప్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక హత్య చేసి తానే చనిపోయినట్లు నిరూపించి ఇన్సూరెన్స్ ని క్లైమ్ చేసుకున్న ఒక క్రిమినల్ గా దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో కనిపించనున్నారు.

ఇంద్రజిత్ సుకుమారన్, శోభితా ధూళిపాళ, అనుపమ పరమేశ్వరన్, శివాజీ పద్మనాభం తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ కథ సడన్గా వచ్చింది కాదని, 2012 నుంచి ఆయన ఈ సినిమా చేయాలని అనుకుంటున్నారు అని 2018 లో అనౌన్స్ చేసి షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయడానికి ఇన్ని నెలలు పట్టింది అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories