Kantara: 'కాంతార' మేకర్స్‌కి షాకిచ్చిన కోర్టు.. ఇకపై దాన్ని ప్రదర్శించకూడదు..

Kerala Court Directed Kantara Makers to Stop Playing Varaha Roopam Song
x

Kantara: ‘కాంతార’ మేకర్స్‌కి షాకిచ్చిన కోర్టు.. ఇకపై దాన్ని ప్రదర్శించకూడదు..

Highlights

Kantara: కేరళకు చెందిన ప్రముఖ బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జ్ వారు కన్నడ లో సూపర్ హిట్ అయిన "కాంతార" సినిమాపై కాపీరైట్ ఉల్లంఘన దావా వేశారు.

Kantara: కేరళకు చెందిన ప్రముఖ బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జ్ వారు కన్నడ లో సూపర్ హిట్ అయిన "కాంతార" సినిమాపై కాపీరైట్ ఉల్లంఘన దావా వేశారు. చిత్ర నిర్మాతలు మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ చిత్రంలోని వరాహ రూపం పాటను ప్లే చేయకూడదు అని వారి వాదన. ఈ నేపథ్యంలో కేరళ కోర్టు కూడా వారికి అనుగుణంగానే పాటపై నిషేధాన్ని జారీ చేసింది. సినిమాలోని వరాహ రూపం పాట మరియు 2015లో బ్యాండ్ వారు రిలీజ్ చేసిన పాట నవరసం మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయని బ్యాండ్ ఆరోపించింది.

ఇప్పుడు సినిమాలోని వరాహ రూపం పాటను అమెజాన్, యూట్యూబ్, స్పాటిఫై, వింక్ మ్యూజిక్, జియోసావన్ మరియు ఇతర మ్యూజిక్ ప్లాట్ ఫామ్ స్ పై ప్లే చేయడం పై నిషేధం విధించారు. తైక్కుడం వారి నవరసం పాట ఒక క్లాసికల్ పాట. ఇది కేరళ యొక్క ప్రసిద్ధ కళారూపమైన కథాకళికి నివాళిగా చెప్తారు.

కాంతారలోని వరాహ రూపం పాట కూడా దక్షిణ కర్ణాటక లోని కొందరి నమ్మకాలకు అద్దం పట్టేలా ఉంటుంది. రెండు పాటల మధ్య సిమిలారిటీ ఎక్కువగా ఉందని, ఇది కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ, బ్యాండ్ ఇంతకుముందు చెప్పింది కానీ ఇప్పుడు కోర్టు లో కేస్ వల్ల పాట పై నిషేదం ఏర్పడింది. సెప్టెంబర్ 30న విడుదలైన "కాంతార" భారీ కమర్షియల్ విజయాన్ని సాధించింది. రిశబ్ శెట్టి ఈ సినిమాలో హీరోగా అద్భుతమైన నటనను కనబరిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories