Keerthy Suresh: మహానటి సినిమా ఒప్పుకున్నందుకు చాలా మంది విమర్శించారు

Keerthy Suresh: "మహానటి సమయంలో చాలా విమర్శలు వచ్చాయి,"

Dhatripriya
Published on: 25 March 2023 3:30 PM IST
Keerthy Suresh Says Many People Criticized After Accepting Mahanati Movie
X

Keerthy Suresh: "మహానటి సినిమా ఒప్పుకున్నందుకు చాలా మంది విమర్శించారు," 

Keerthy Suresh: నాచురల్ స్టార్ నాని హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "దసరా". శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈనెల 30వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. "మహానటి" బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఆమె వెన్నెల అనే ఒక పక్క పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనిపించనుంది. తాజాగా చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఒకానొక సమయంలో తనను కొంతమంది తీవ్రంగా విమర్శించారని గుర్తుచేసుకుంది.

లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన "మహానటి" సినిమాని ఒప్పుకున్న సమయంలో అసలు ఆమె పాత్రకి ఎలా సరిపోతావు అంటూ చాలామంది కామెంట్లు చేశారట. "అందుకే మొదట ఆ సినిమాకి నేను నో చెప్పాను. కానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పట్టు పట్టి నా పై నమ్మకాన్ని చూపించి ధైర్యం చెప్పి నాతో సినిమా చేయించారు. ఆయన నన్ను అంతగా నమ్ముతున్నారు నేను ఎందుకు నన్ను నేను నమ్మకూడదు అని అనిపించింది. అందుకే మహానటి సినిమాలో నటించిన.

సినిమా ప్రమోషన్స్ టైం లో కూడా నాపై వచ్చిన ట్రోల్స్ చూసి చాలా షాక్ అయ్యాను. కానీ సినిమా విడుదల తర్వాత వాటన్నిటికీ జవాబు లభించినట్లు అయింది. నిజానికి ఆ పాత్రలో ఎవరు నటించిన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సావిత్రమ్మ కూతురితో కూడా మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాను. డైరెక్టర్ మరియు చిత్ర బృందం ఇచ్చిన ప్రోత్సాహంతో సినిమాని చేశాను," అని మహానటి సినిమా సమయాన్ని గుర్తుచేసుకుంది కీర్తి సురేష్.

Dhatripriya

Dhatripriya

Next Story