Keerthy Suresh: జీరో షేర్ తో డిజాస్టర్ అందుకున్న కీర్తి సురేష్

keerthy Suresh: వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న స్టార్ బ్యూటీ కీర్తి సురేష్, ఈ మధ్యనే "గుడ్ లక్ సఖి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

admin1
Updated on: 1 Feb 2022 11:30 AM IST
Keerthy Suresh Received Disaster With Zero Share
X

జీరో షేర్ తో డిజాస్టర్ అందుకున్న కీర్తి సురేష్

KeerthySuresh: వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ ఈ మధ్యనే "గుడ్ లక్ సఖి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ మరియు ట్రైలర్తో అంతంతమాత్రంగానే మెప్పించిన ఈ చిత్రం విడుదలయ్యాక కూడా యావరేజ్ రెస్పాంస్ ని పొందింది. ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ వరకు ఎవరికీ ఈ సినిమా పెద్దగా నచ్చలేదు. భారీ బడ్జెట్ సినిమా కాకపోవడంతో ఈ సినిమాకి కనీసం మంచి టాక్ అయినా లభించి ఉంటే కలెక్షన్ లు ఒక మోస్తరుగా వచ్చి ఉండేదేమో. కానీ విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకోవడంతో చాలా వరకు సెంటర్లలో సినిమా కలెక్షన్లు కూడా బాగా దెబ్బతిన్నాయి.

జీరో షేర్ను అందుకుని "గుడ్ లక్ సఖి" బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. పెంగ్విన్, మిస్ ఇండియా వంటి సినిమాలు తో ఇంతకు ముందు తన అదృష్టాన్ని పరీక్షించుకున్న కీర్తి సురేష్ ఆ సినిమాలతో కూడా మంచి హిట్ అందుకోవడంలో విఫలమైంది. మహానటి తర్వాత కీర్తి సురేష్ పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ చేయలేదు. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సర్కారు వారి పాట" సినిమా తో బిజీగా ఉంది.

admin1

admin1

Next Story