మహానటి సినిమా కోసం ఆసక్తికరమైన టైటిల్

Ruthvik
Updated on: 17 May 2019 10:23 AM IST
మహానటి సినిమా కోసం ఆసక్తికరమైన టైటిల్
X

'మహానటి' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తరువాత తెలుగులో రెండు డబ్బింగ్ సినిమాలో కనిపించింది కానీ మంచి విజయాలను సాధించలేక పోయింది. ఇక తాజాగా ఈమెకు ఒక బాలీవుడ్ లో ఒక ప్రముఖ దర్శకుడి సినిమాలో నటించే అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరోవైపు కీర్తి సురేష్ కొత్త దర్శకుడు నరేంద్ర తో ఒక సినిమాను సైన్ చేసినట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమా ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ యూరోప్ లో జరగబోతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఒక ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'సఖి' అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ చిత్రబృందం ఈ టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మహేష్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రముఖ నటులు నదియ, నరేష్, రాజేంద్ర ప్రసాద్, కమల్ కామరాజు భాను శ్రీ మెహ్రా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.





Ruthvik

Ruthvik

Next Story