మిస్‌ ఇండియా ట్రైలర్‌ : విదేశాల్లో కీర్తి చాయ్‌ బిజినెస్‌

మిస్‌ ఇండియా ట్రైలర్‌ : విదేశాల్లో కీర్తి చాయ్‌ బిజినెస్‌
x
Highlights

Miss India Official Trailer : నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్ మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కీర్తి మెయిన్ లీడ్ లో మిస్ ఇండియా అనే సినిమాని చేస్తోంది.

Miss India Official Trailer : నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్ మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కీర్తి మెయిన్ లీడ్ లో మిస్ ఇండియా అనే సినిమాని చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా దసరా సందర్భంగా సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.. రెండు నిమిషాల 19 సెకండ్స్ ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఈ ట్రైలర్ ని గమనించినట్టు అయితే ఇందులో కీర్తి సురేష్ ఉన్నతమైన భావాలు కలిగిన అమ్మాయిగా కనిపిస్తుంది. తానూ అనుకున్నది సాధించే క్రమంలో ఒడిదుడుకులను ఎదుర్కొనే ఓ సాధారణ అమ్మాయిగా ఆమె పాత్రను డిజైన్ చేశారు. మిస్‌ ఇండియా అంటే నేను కాదు ఒక బ్రాండ్‌ అంటూ కీర్తి చెప్పే డైలాగ్ టీజర్ మొత్తానికి హైలెట్ అని చెప్పాలి. ఇక బిజినెస్ చెయలని అనుకున్న కీర్తి విదేశాల్లోకి వెళ్లి ఇండియన్ ఛాయ్ ని బిజినెస్ గా పెట్టి ఎలా ఎదిగింది. మధ్యలో జగపతిబాబుతో వైరం ఎలా వచ్చింది అన్న అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి..

ఇక ఈ సినిమాని నవంబర్ 04 న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకి నరేంద్రనాథ్‌ దర్శకత్వం వహించగా, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాతో పాటుగా మహేష్ బాబు సర్కారు వారి పాట, గుడ్ లక్ సఖి అనే సినిమాని చేస్తోంది కీర్తి.. క్రీడా నేపధ్యంలో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories