లిప్ సర్జరీ చేయించుకున్న కీర్తి సురేష్..?

Keerthy Suresh Lip Surgery for Sarkaru Vaari Paata Movie | Tollywood Gossips
x

లిప్ సర్జరీ చేయించుకున్న కీర్తి సురేష్..?

Highlights

Keerthy Suresh: మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తరువాత వరుసగా డిజాస్టర్ సినిమాలతో...

Keerthy Suresh: మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తరువాత వరుసగా డిజాస్టర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన సర్కార్ వారి పాట సినిమాలో హీరోయిన్ గా కనిపించిన కీర్తి సురేష్ ఈ సినిమాతో మళ్లీ మంచి హిట్ ను అందుకుంది. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ లుక్ చూసిన కొందరు అని ఆమె లిప్ సర్జరీ చేయించుకుంది అని కామెంట్లు చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో లిప్ సర్జరీ చాలా కామన్ అయిపోయింది. తమ పెదాలకు సర్జరీ చేయించుకుని అందాన్ని మరింత పెంచుకోవడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపిస్తున్నారు. మరి కొందరు నటీమణులు లిప్ సర్జరీ తో ఆగిపోకుండా ముక్కు సర్జరీ అని బోటాక్స్ అని చేయించుకుంటూనే ఉన్నారు. ఈ మధ్యనే శృతి హాసన్ కూడా సర్జరీ చేయించుకున్నట్లు ఒప్పుకుంది.

అది పూర్తిగా వారి నిర్ణయమే. కాబట్టి మరొకరికి వేలెత్తి చూపించే హక్కు లేదు. ఏదేమైనా చాలా కాలం తర్వాత కీర్తి సురేష్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయిందని ముఖ్యంగా "మా మా మహేషా" పాటలో కీర్తి సురేష్ చాలా బాగా కనిపించిందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories