Keerthy - Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మహానటి

admin1
Published on: 7 Aug 2021 1:04 PM IST
Keerthy Suresh Joining in Mega Star Chiranjeevi New Movie 2021 as Sister Character
X

కీర్తి సురేష్ - చిరంజీవి (ఫైల్ ఫోటో)

Keerthy Suresh- Chiranjeevi New Movie: "మహానటి" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కీర్తి సురేష్ ఈ మధ్యనే "రంగ్ దే" సినిమాలో నితిన్ సరసన నటించింది. తాజాగా "సర్కారు వారి పాట" లో మహేష్ బాబు తో రొమాన్స్ చేయబోతున్న కీర్తి సురేష్ ఇప్పుడు మెగాస్టార్ సినిమా లో ఒక కీలక పాత్ర ను పోషించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ మరోవైపు వరుసగా సినిమాలు సైన్ చేస్తూ వెళ్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మలయాళం సినిమాలు "లూసిఫర్" మరియు "డ్రైవింగ్ లైసెన్స్" తెలుగు రీమేక్ తో బిజీ అవనున్న మెగాస్టార్ ఇప్పుడు మరొక రీమేక్ సినిమాకు ఓకే చెప్పారు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ్ సూపర్ హిట్ సినిమా "వేదాలం" తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం దర్శక నిర్మాతలు కీర్తి సురేష్ ను సంప్రదించినట్లు సమాచారం. ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి సోదరిగా కనిపించనుంది. ఈ సినిమాలో తనది చాలా ముఖ్యమైన పాత్ర కావడంతో సినిమా మొదటి షెడ్యూల్ నుంచి ఈమె షూటింగ్ లో పాల్గొననుంది. అయితే ఈ సినిమా పట్టలెక్కడానికి మాత్రం మరికొంత సమయం పడుతుందని సమాచారం. ముందుగా ఈ పాత్ర కోసం సాయి పల్లవి ని అనుకున్నారు కానీ తరువాత "ఫిదా" బ్యూటీ కి బదులుగా కీర్తి సురేష్ ను రంగంలోకి దింపారు.

admin1

admin1

Next Story