Keerthy Suresh: ఓటీటీలో కీర్తి సురేష్ మరో సినిమా?

Keerthy Suresh Good Luck Sakhi to Release on zee5
x

గుడ్ లక్ సఖి పోస్టర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Keerthy Suresh: 'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్ నటించిన మరో సినిమా 'గుడ్ లక్ సఖి' ఓటీటీలో విడుదలకానుందని సమాచారం.

Keerthy Suresh: 'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్ నటించిన మరో సినిమా 'గుడ్ లక్ సఖి' ఓటీటీలో విడుదలకానుందని సమాచారం. గతంలో కీర్తి నటించిన ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు పెంగ్విన్, మిస్ ఇండియా కూడా ఓటీటీలో విడుదలై ఓకే అనిపించాయి. కరోనా కారణంగా ఈ సినిమాలు థియేటర్‌లో కాకుండా..డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైయాయి.

ఇక ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ ఫైవ్‌లో స్ట్రీమ్ చేయనున్నారని తెలుస్తోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్నారు.

నగేష్ కుకునూర్ గతంలో 'హైదరాబాద్ బ్లూస్', 'తీన్ దీవారే', 'ఇక్బల్' వంటి డిఫరెంట్ సినిమాలను తీసిన సంగతి తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా జూన్ 3న విడులయ్యేది. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories