Rang De Movie: బేబీ బంప్ తో కనిపించనున్న మహానటి

Rang De Movie: కీర్తి సురేష్.. చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరు. మహానటి తరువాత, కీర్తిపై క్రేజ్ పెరిగింది.

Venkata Chari
Published on: 24 March 2021 5:22 PM IST
Keerthy Suresh Flaunts Baby Bump in Nithiins Range de Movie
X
కీర్తి సురేష్, నితిన్ (ఫొటో ట్విట్టర్)

Rang De Movie: కీర్తి సురేష్.. చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరు. మహానటి తరువాత, కీర్తిపై క్రేజ్ పెరిగింది. ఆమె తన కెరీర్లో ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. ఈ నటి ప్రస్తుతం తన కొత్త చిత్రం 'రంగ్ దే' ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ చిత్రంలో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కీర్తీ సురేష్ ఈ చిత్రంలో బేబీ బంప్‌తో కనిపిస్తుందంట. ఇలాంటి విజువల్స్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారని తెలుస్తోంది.

సినిమాలో కీర్తీ సురేష్ ప్రెగ్నెంట్ లేడీగా కనిపిస్తుందని ట్రైలర్ లో ఇప్పటికే వెల్లడైంది. అంతకుముందు, పెంగ్విన్ చిత్రంలో కీర్తి ఇలాంటి పాత్రను పోషించారు. బేబీ బంప్‌తో కీర్తి కనిపించబోయే మరో చిత్రం ఇది. అయితే, ఈ సినిమాలో చాలా తక్కువ సమయం మాత్రమే కీర్తి బేబీ బంప్ తో కనిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను వెంకీ అట్లూరీ డైరెక్షన్ చేస్తున్నారు. పీసీ శ్రీరామ్ ఈ చిత్రం డీఓపీ అందిస్తుండగా... దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రం మార్చి 26 న విడుదలవుతోంది. 'చెక్' మూవీతో నిరాశపరిచిన నితిన్ ఈ సినిమాతో ఫాంలోకి వస్తాడో లేదో చూడాలి. ఈ సినిమాపై నితిన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు

Venkata Chari

Venkata Chari

Next Story