Keerthy Suresh: దోపిడి దొంగగా మారిన మహానటి

Keerthy Suresh: సాని కాయిదమ్‌ అనే తమిళ చిత్రంలో కీర్తి సురేష్‌ దోపిడి దొంగ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

Kranthi
Published on: 30 Jun 2021 4:05 PM IST
Keerthy Suresh Doing a Interesting Role in Tamil Film Saani Kaayidham Shoot
X

Keerthy Suresh:(Instagram) 

Keerthy Suresh: అల‌నాటి న‌టి సావిత్రి జీవితాధారంగా తెర‌కెక్కిన 'మహాన‌టి'లో సావిత్రి పాత్ర‌లో జీవించి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అలాంటి పాత్రలో చూసిన మనం ఇపుడు దోపిడీ దొంగ గా చూడబోతున్నాం. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తమిళ చిత్రం 'సాని కాయిదమ్‌ వస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ దోపిడి దొంగ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కీర్తి సురేష్ నెగెటివ్‌ ఛాయలతో సాగే పాత్రలో కనిపించనుందట. ఆ మధ్య కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ మంగళవారం చెన్నైలో పునఃప్రారంభమైంది

ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్‌ నటుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. తమిళనాడులో 1980 దశకంలో జరిగిన నిజ జీవిత సంఘటనలతో ఆధారంగా ఈ సినిమా వస్తుందట. తమకు.. తమ జాతికి జరిగిన అన్యాయాల్ని ఎదిరించే క్రమంలో దోపిడి దొంగలుగా మారి ఎలా తమకు అన్యాయాల్నీ ఎదుర్కోన్నారు అనేది కథాంశం ఉండనుందని సమాచారం. ఇక ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే తెలుగులో కీర్తి ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాటలో నటిస్తోంది. తమిళ్‌లో అన్నాత్తే లో నటిస్తుంది. దీనికి అరుణ్‌మాతేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Kranthi

Kranthi

Next Story