Keerthy Suresh: మహానటి ఆశలన్ని మహేష్ సినిమాపైనే..

Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ ఆశలన్నీ ప్రిన్స్ మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాపైనే ఉన్నాయి.

Venkata Chari
Published on: 6 April 2021 11:47 AM IST
Keerthy Suresh Hopes on Mahesh Babu New Movie Sarkaru Vaari Paata
X
కీర్తి సురేష్, మహేష్ బాబు (ఫొటో: ది హన్స్ ఇండియా)

Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ ఆశలన్నీ ప్రిన్స్ మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాపైనే ఉన్నాయి. ప్రస్తుతం ఓ బ్లాక్ బస్టర్ హిట్ కోసం కీర్తి సురేష్ ఎదురుచూస్తోంది. తన గత చిత్రాలు ఓటీటీలో విడుదలైన 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.

నితిన్ తో నటించిన 'రంగ్ దే' సినిమా కూడా మిశ్రమ స్పందనతో నడుస్తోంది. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వెనకపడింది. భారీ హిట్ అయితే సాధించకపోవచ్చని ట్రేడ్ ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి మెప్పు పొందారు.

ప్రస్తుతం ఓ భారీ విజయం కోసం ఈ హీరోయిన్ ఎదురుచూస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాటా' చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రిన్స్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కీర్తి సురేష్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.

కాగా, కీర్తి సురేష్ కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోయే చిత్రం 'అన్నాతే' లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story