Keerthy Suresh - Vadivelu: కమెడియన్ సరసన నటించడానికి సిద్ధం అయిన స్టార్ హీరోయిన్

* ఈ సినిమాకి నాయి శేఖర్ రిటర్న్స్ అనే టైటిల్ ను ఖరారు చేశారని సమాచారం * శునకాల నేపథ్యంలోనే కథ నడుస్తుంది

admin1
Updated on: 21 Sept 2021 9:15 PM IST
Keerthy Suresh Acts Alongside with Comedian Vadivelu in Nai Sekhar Returns Movie
X

 కీర్తి సురేష్ - వడివేలు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Keerthy Suresh - Vadivelu: "మహానటి" సినిమా తర్వాత కీర్తి సురేష్ దశ తిరిగింది అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కీర్తి సురేష్ వరుసపెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం కూడా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు ఒక కమెడియన్ సరసన నటించడానికి సిద్ధం అవ్వడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఒకవైపు సార్ హీరో సినిమాలు మరో వైపు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు కమెడియన్ వడివేలు సరసన " నాయి శేఖర్ రిటర్న్స్" అనే సినిమాలో హీరోయిన్ గా నటించనుందని కొలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోందని, సినిమా కీలకంగా మారబోతోంది అని అందుకే ఇలాంటి పాత్ర చేయడానికి కీర్తి సురేష్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఈమె వడివేలు సరసన హీరోయిన్ గా కనిపిస్తారా లేక సినిమాలో కీలకపాత్ర పోషిస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నాయి అంటే తమిళంలో కుక్క అని అర్థం. శునకాల నేపథ్యంలోనే కథ నడుస్తుంది కాబట్టి ఈ సినిమాకి నాయి శేఖర్ రిటర్న్స్ అనే టైటిల్ ను ఖరారు చేశారని సమాచారం. ఇక ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

admin1

admin1

Next Story