Keerthi Suresh: రీమేక్ సినిమాలో తల్లి పాత్రలో కనిపించనున్న మహానటి

Keerthi Suresh: మరొక సారి గర్భవతిగా కనిపించనున్న కీర్తి సురేష్

admin1
Published on: 30 Aug 2021 3:02 PM IST
Keerthi Suresh Plays a Mother Role in Remake Movie
X

తల్లి పాత్రలో నటించనున్న కీర్తి సురేష్ (ఫైల్ ఇమేజ్)

Keerthi Suresh: మహేష్ బాబు "వన్ నేనొక్కడినే" సినిమాతో తెలుగు ప్రేక్షులకు పరిచయమైన బాలీవుడ్ భామ కృతీసనన్‌ తాజాగా హిందీ లో "మిమీ" అనే సినిమాలో లీడ్‌ పాత్రలో నటించి మంచి హిట్ అందుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పుడు తెలుగు మరియు తమిళ భాషల్లో రీమేక్‌ కాబోతోంది అని వార్తలు వినిపస్తున్నాయి. "మిమీ" సినిమా తెలుగు రీమేక్‌ హక్కులను ఈ మధ్యనే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ చేజిక్కించుకుందట. మరొక ఆస్తికరమైన విషయం ఏమిటంటే కృతీసనన్‌ చేసిన పాత్రను సౌత్‌లో కీర్తి సురేశ్‌ చేయనున్నారని టాక్ వినపిస్తోంది.

సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అవుదామని అనుకుంటున్న ఒక విదేశీ జంట ఇండియా వస్తారు. వారికి ఒక డాన్సర్ అయిన మిమి కనిపిస్తుంది. ఆమె వీరికోసం బిడ్డను ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. తర్వాత ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని ఇప్పుడు తెలుగు రీమేక్ అంటే అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా కీర్తి సురేష్ ను ఈ పాత్రలో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురచూస్తున్నారు. మొదటి హాఫ్ మొత్తం సరదా సరదాగా రెండవ హాఫ్ ఆద్యంతం ఎమోషనల్ గా నడిచే ఈ కథ ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇంతకు ముందు కూడా పెంగ్విన్ మరియు రంగ్ దే చిత్రాలలో కీర్తి సురేష్ గర్భవతిగా కనిపించారు.

admin1

admin1

Next Story