మరొక ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో కీర్తి సురేష్

Ruthvik
Published on: 3 May 2019 5:45 PM IST
మరొక ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో కీర్తి సురేష్
X

'మహానటి' సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రలో తన నటనా నైపుణ్యాన్ని చాటిన కీర్తి సురేష్ ఆ సినిమా తరువాత కొన్ని డబ్బింగ్ సినిమాలలో నటించింది. కానీ అవి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. తాజాగా బాలీవుడ్ లో కూడా ఒక మంచి అవకాశాన్ని అందుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగులో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయడానికి రెడీ అవుతోందట. నరేంద్రనాథ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కావాల్సిన ఈ సినిమా షూటింగ్ గురించి తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర బృందం త్వరలో యూరప్ వెళ్లనుందట. అక్కడ 45 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. '118' చిత్రాన్ని నిర్మించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మించనున్నారు. ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ నటులు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి ఈ ఏడాది ఆఖరుకల్లా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Ruthvik

Ruthvik

Next Story