బంపర్ ఆఫర్ కొట్టేసిన 'మహానటి'

బంపర్ ఆఫర్ కొట్టేసిన మహానటి
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ...

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ కొనసాగుతోంది.

ఇప్పటికే అనుష్క, నయనతార వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. శృతిహాసన్ పేరు కూడా వినిపించింది. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో కీర్తి సురేష్ పేరు కూడా బయటకు వచ్చింది. 'మహానటి' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో పెద్ద హిట్ సినిమాల్లో నటించలేదు. అయితే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం కీర్తి సురేష్ కు దక్కింది. దీనిపై కూడా ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories