కీర్తి రెండు పాత్రల్లో కనిపించనుందట

Ruthvik
Published on: 25 March 2019 1:26 PM IST
కీర్తి రెండు పాత్రల్లో కనిపించనుందట
X

'మహానటి' సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రలో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన కీర్తి సురేష్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. 'బధాయి హో' ఫేం అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక సినిమాలో అజయ్ దేవగన్ హీరో కాగా, కీర్తి హీరోయిన్ పాత్రలో కనిపించనుంది. ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు 1953 నుండి 1963 వరకూ కోచ్ గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రానున్న బయోపిక్ ఇది. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.

ఈ చిత్రంలో కీర్తి ద్విపాత్రాభినయం చేస్తోందట. రెండు విభిన్న పాత్రల్లో కీర్తి కనిపించనుంది అని తెలుస్తోంది. ఒక పాత్ర మధ్యవయస్కురాలిగా ఉంటుందని సమాచారం కానీ ఆ పాత్రకు కీర్తి ప్రోస్థటిక్ మేకప్ లాంటివి వాడట్లేదు కేవలం తన నటనతోనే ఆడియన్స్ ను మెప్పిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరుణవ జోయ్ సేన్ గుప్తా లు సంయక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ డెబ్యూ సినిమాలోనే కీర్తి కి ఈ అవకాశం వచ్చిందంటే గొప్ప అనే చెప్పాలి.

Ruthvik

Ruthvik

Next Story