Keerthy Suresh: మహానటి హీరోయిన్స్ తో నాచురల్ స్టార్

Dasara Movie Update: నాని సరసన నటించున్న మహానటి హీరోయిన్స్

admin1
Updated on: 1 Nov 2021 4:13 PM IST
Keerthi Suresh as Heroin in Natural Star Nanis Dasara Movie
X
మహానటి హీరోయిన్స్ తో జతకట్టనున్న నాని (ఫైల్ ఇమేజ్)

Keerthy Suresh: నాచురల్ స్టార్ నాని ఈమధ్యనే "టక్ జగదీష్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో విడుదలైంది. అయితే ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. ఇక తాజాగా తన ఆశలన్నీ తన తదుపరి సినిమాలు "శ్యామ్ సింగరాయి" మరియు "అంటే సుందరానికి" మీదే పెట్టుకున్నాడు నాని. ఒకవైపు ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న నాని తాజాగా "దసరా" అని ఇంకొక సినిమాని సైతం ప్రకటించారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర కోసం కీర్తి సురేష్ ని ఎంచుకున్నారు దర్శకనిర్మాతలు. ఇంతకుముందు "నేను లోకల్" సినిమా లో నాని మరియు కీర్తి కలిసి నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం స్టార్ హీరోయిన్ సమంతని ఎంపిక చేసినట్లు సమాచారం. నాని సరసన సమంత "ఎటో వెళ్లిపోయింది మనసు" మరియు "ఈగ" సినిమాలలో నటించింది. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సమంత మరియు కీర్తి సురేష్ కూడా కలిసి "మహానటి" సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story