బిగ్ బీ అమితాబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

బిగ్ బీ అమితాబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
x
Highlights

కౌన్‌ బనేగా కరోడ్‌ పతీ సీజన్‌ 12 తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. షో హోస్ట్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గత శుక్రవారం కరమ్‌ వీర్‌...

కౌన్‌ బనేగా కరోడ్‌ పతీ సీజన్‌ 12 తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. షో హోస్ట్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గత శుక్రవారం కరమ్‌ వీర్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ సందర్భంగా అడిగిన ఓ ప్రశ్న ఇందుకు కారణమైంది. సామాజిక వేత్త బెజవాడ విల్సన్‌, నటుడు అనూప్‌ సోనీలను.. 6లక్షల 40వేల రూపాయలకు సంబంధించి బిగ్ బీ.. ఈ ప్రశ్న అడిగాడు. 1927లో బీఆర్‌ అంబేద్కర్‌ అనుచరులు ఏ గ్రంథ ప్రతులను తగులబెట్టారన్న ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందంటూ ఫిర్యాదులో తెలిపాడు. దీంతో బిగ్‌బీతో పాటు షో నిర్వహకులపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories