Vijay Deverakonda New Movie: విజయ్ దేవరకొండ సినిమాలో కత్రినా కైఫ్?

Vijay Deverakonda New Movie: బాలీవుడ్‌లో ఏ-లైన్ హీరోయినన్లలో ఒకరైన కత్రినా కైఫ్.. ప్రస్తుతం ఆఫర్‌ల కోసం కష్టపడుతున్నారు.

Venkata Chari
Updated on: 8 May 2021 3:03 PM IST
Katrina Kaif in Talks for Vijay Deverakonda?
X
విజయ్ దేవరకొండ, కత్రినా కైఫ్ (ఫొటో ట్విట్టర్)

Vijay Deverakonda New Movie: బాలీవుడ్‌లో ఏ-లైన్ హీరోయినన్లలో ఒకరైన కత్రినా కైఫ్.. ప్రస్తుతం ఆఫర్‌ల కోసం కష్టపడుతున్నారు. అక్షయ్ కుమార్ నటించిన 'సూర్యవంశి' సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోంది ఈ నటి. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులు మాత్రమే తన చేతిలో ఉన్నాయి.

తాజాగా కత్రినా కైఫ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండతో కలిసి కత్రినా కైఫ్ రొమాన్స్ చేసేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఖచ్చితంగా క్రేజీ కాంబినేషన్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. వీరి మధ్య కెమిస్ట్రీని చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు. విజయ్ దేవర్‌కొండ చేతిలో శివ మోక్షం, కొరటాల శివ సినిమాలు ఉన్నాయి. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా ఏ సినిమా కోసం చర్చలు జరుపుతున్నారో ఇంకా తెలియరాలేదు. అంతా ఓకే అయితే, కత్రినా చాలా కాలం తర్వాత తిరిగి టాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది.

మరోవైపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న 'లైగర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది.

Venkata Chari

Venkata Chari

Next Story