Katrina Kaif: డిసెంబర్ మొదటి వారంలో కత్రినా, విక్కీ కౌశల్ వివాహం

* డిసెంబర్ మొదటి వారంలో కత్రినా, విక్కీ కౌశల్ వివాహం * వేడుకకు కేవలం వంద మందికి మాత్రమే ఆహ్హానం

Shilpa
Updated on: 26 Nov 2021 3:03 PM IST
Katrina Kaif and Vicky Kaushal Marriage in December 2021
X

డిసెంబర్ మొదటి వారంలో కత్రినా, విక్కీ కౌశల్ వివాహం(ఫైల్ ఫోటో)

Katrina Kaif Marriage: బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ పెళ్లి పనులు చకచక జరిగిపోతున్నాయి. డిసెంబర్‌ మొదటి వారంలో ఈ మగువ హీరో విక్కీ కౌశల్‌‌ను మనువాడనుంది. రాజస్థాన్‌లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో మ్యారేజ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ వివాహ వేడుకలకు కేవలం 100 మంది అతిథులు మాత్రమే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్హానం అందినట్లు తెలుస్తోంది. కాగా ఈ జంట అభిమానులను ఓ రిక్వెస్ట్ చేసింది. తమ పెళ్లి ఫోటోలు, వీడియోలు బయటకు లీక్‌ కావడం ఇష్టం లేదని వేడుకలకు వచ్చే అతిధులెవ్వరూ ఫోన్లు తీసుకురావొద్దని కోరారట.

అయితే బాలీవుడ్ నుంచి రణవీర్- దీపికా, అనుష్కా శర్మ, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి లాంటి అతికొద్ది ప్రముఖలకు మాత్రమే ఇన్విటేషన్స్ అందాయట. ఇక తమ రిలేషన్‌షిప్‌ విషయంలో మొదటి నుంచి గోప్యత వహించిన కత్రినా, బాలీవుడ్ మీడియాకు విషయం తెలిసిపోవటంతో కాస్త ఇబ్బంది పడింది‌.

Shilpa

Shilpa

Next Story