Karthikeya 2: జూలైలో విడుదల కాబోతున్న కార్తికేయ 2

Karthikeyan 2 Movie to be Released in July | Tollywood News
x

జూలైలో విడుదల కాబోతున్న కార్తికేయ 2

Highlights

Karthikeya 2: జూలైలో విడుదల కాబోతున్న కార్తికేయ 2

.Karthikeya 2: కనీసం సంవత్సరానికి ఒక సినిమా చొప్పున చేసుకుంటూ వస్తున్న యువ హీరో నిఖిల్ కి 2019లో అర్జున్ సురవరం సినిమా తర్వాత బ్రేకులు పడ్డాయి. దాదాపు 2 ఏళ్ల తర్వాత నిఖిల్ ఇప్పుడు "కార్తికేయ 2" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిఖిల్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కనుంది.

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జులై 22న థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

అభిషేక్ చిత్రనిర్మాత అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కార్తికేయ లాగానే కార్తికేయ టూ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని చూస్తేనే తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories