100 కోట్ల మార్క్ ని దాటడానికి రెడీ అవుతున్న "కార్తికేయ 2"

Karthikeya 2 Movie all Set to Cross the 100 Crore Mark
x

100 కోట్ల మార్క్ ని దాటడానికి రెడీ అవుతున్న "కార్తికేయ 2"

Highlights

Karthikeya 2: 100 కోట్ల క్లబ్ లో చేరనున్న నిఖిల్ సినిమా

Karthikeya 2: "అర్జున్ సురవరం" సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయిన యువ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ కరోనా తర్వాత మొట్టమొదటిసారిగా "కార్తికేయ 2" సినిమాతో ఈ మధ్యనే వెండితెరపై కనిపించారు. 2014లో విడుదలై బ్లాక్ బస్టర్ గా మారిన "కార్తికేయ" సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ద్వారకా మరియు శ్రీకృష్ణుడి హిస్టరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నిజానికి ఈ సినిమా ని 20-30 కోట్ల బడ్జెట్తో తీశారు కానీ బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన రెండు వారాల్లోనే ఈ సినిమా 70 కోట్ల వసూళ్లను నమోదు చేసుకుంది. ఇక హిందీలో కూడా ఈ సినిమా బాగానే ఆడుతూ ఉండడంతో త్వరలోనే సినిమా 100 కోట్ల కలెక్షన్ల మార్కును కూడా దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా నిజంగానే వంద కోట్ల క్లబ్ లో చేరితే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి నాన్ టైర్ టు హీరోగా

నిఖిల్ పేరు మారుమ్రోగుతుంది. ఇక అమెరికాలో కూడా ఈ సినిమా కలెక్షన్లు భారీగానే నమోదవుతున్నాయి. ఇక తెలుగులో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రొటీన్ కధలకు దూరంగా ఉంటూ సరికొత్త ఎక్స్పరిమెంటల్ సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్లు అందుకుంటూ నిఖిల్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories