మెగా హీరోతో సినిమా చేయబోతున్న "కార్తికేయ 2" డైరెక్టర్

Karthikeya 2 Director Chandoo Mondeti Next Movie With Varun Tej
x

మెగా హీరోతో సినిమా చేయబోతున్న "కార్తికేయ 2" డైరెక్టర్

Highlights

Chandoo Mondeti: "కార్తికేయ" సినిమాతో దర్శకుడిగా మారిన చందు మొండేటి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

Chandoo Mondeti: "కార్తికేయ" సినిమాతో దర్శకుడిగా మారిన చందు మొండేటి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ఆ తరువాత చందు మొండేటి దర్శకత్వం వహించిన "సవ్యసాచి" సినిమా సరిగ్గా ఆడకపోవడంతో చందు కి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ తాజాగా విడుదలైన "కార్తికేయ 2" సినిమాతో చందు మొండేటి పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తోంది.

యువ హీరోలు చందు మొండేటితో సినిమా చేయడానికి రెడీ అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం చందూమండేటికీ ఒక మెగా హీరోతో సినిమా చేసే అవకాశం కూడా వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాజాగా డైరెక్టర్ చందు మండేటి తో ఒక సినిమా నిర్మించడానికి సిద్ధమయ్యారు. దాంట్లో హీరోగా మెగా హీరో వరుణ్ తేజ్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్యనే వరుణ్ తేజ్ హీరోగా గీత ఆర్ట్స్ నిర్మాణంలో విడుదలైన "గని" సినిమా డిజాస్టర్ గా మారింది. ఈ నేపథ్యంలో చందు మొండేటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ కి ఎలాగైనా ఒక హిట్ సినిమా ఇప్పించాలని చందూ మొండేటి ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. అయితే వరుణ్ తేజ్ మరియు చందు మొండేటిలా సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories