బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న 'కార్తికేయ 2'.. రెండు రోజుల వాల్డ్ వైడ్ కలెక్షన్స్...

Karthikeya 2 2nd day Collections Report
x

బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ‘కార్తికేయ 2’.. రెండు రోజుల వాల్డ్ వైడ్ కలెక్షన్స్...

Highlights

Karthikeya 2 2nd day Collections: నిఖిల్ సిద్ధార్థ హీరోగా 2014వ సంవత్సరంలో విడుదలైన కార్తికేయ మూవీ సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.

Karthikeya 2 2nd day Collections: నిఖిల్ సిద్ధార్థ హీరోగా 2014వ సంవత్సరంలో విడుదలైన కార్తికేయ మూవీ సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన కార్తికేయ 2 సినిమా ఆగస్టు 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం తొలి రోజే హిట్‌టాక్‌ సంపాదించుకుంది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. చాలా పరిమిత థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్యాక్డ్ హౌస్‌లతో వావ్ అనిపిస్తోంది.

ఇక ఈ సినిమా రెండో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాం: 2.60 కోట్లు, సీడెడ్: రూ. 1.09 కోట్లు.. ఉత్తరాంధ్ర : 95 లక్షలు, ఈస్ట్ : 62 లక్షలు, పశ్చిమ గోదావరి : 45 లక్షలు, గుంటూరు : 75 లక్షలు, కృష్ణ : 57 లక్షలు... నెల్లూరు రూ. 28 లక్షలు మొత్తంగా రెండు రోజుల్లో తెలంగాణ+ ఆంధ్ర ప్రదేశ్ కలిసి రూ. 7.31 కోట్లు షేర్‌ (రూ. 11.15 కోట్ల గ్రాస్ ) వసూళ్లను రాబట్టింది. ఇక వీటితో పాటు కర్నాటక, రెస్టా ఆఫ్ ఇండియా : రూ. 45 లక్షలు, ఓవర్సీస్ : రూ. 2.15 కోట్లు నార్త్ ఇండియా రూ. 16 లక్షలు షేర్ వచ్చింది. దీంతో టోటల్ వరల్డ్ వైడ్‌గా చూస్తే రెండు రోజుల్లో : రూ. 10.07 కోట్లు షేర్ (రూ. 17 కోట్ల గ్రాస్) వసూళ్లతో కేక పెట్టిందనే చెప్పోచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories