Ram 19 Movie: వెండితెరపై వంటలక్క ఎంట్రీ..!!

* బుల్లితెర నుండి వెండితెరకి ఎంట్రీ * రామ్ 19 చిత్రంతో సినిమా పరిశ్రమ వైపు...

Sandeep Reddy
Published on: 14 July 2021 3:46 PM IST
Karthika Deepam Vantalakka Silver Screen Entry in Hero Ram Pothineni 19 Movie
X

రామ్, ప్రేమ్ విశ్వనాథ్ (ఫైల్ ఫోటో)

Ram 19 Movie: తన 18 ఏళ్ళ వయసులోనే దేవదాసు చిత్రంతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన యంగ్ ఎనేర్జిటిక్ హీరో రామ్ తన కెరీర్లో మంచి కథలను ఎంచుకుంటూ తను నటించిన 18 చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించి నటుడిగా మంచి గుర్తింపు పొందటమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ మంచి ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇటీవల తమిళ సినిమా "తాడం"ను తెలుగు రీమేక్ "రెడ్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ ఆ చిత్రంతో మంచి విజయాన్ని సాధించాడు. తాజాగా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని తన 19వ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఇప్పటికే ఈ చిత్రంలో "ఉప్పెన" బ్యూటీ కృతిశెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేశారు.

అయితే తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బుల్లితెరలో ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న "కార్తీకదీపం" సీరియల్ లో నటించే వంటలక్కని రామ్ 19 చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే బుల్లితెరలో ఒక స్టార్ నటిగా వెలుగొందుతున్న వంటలక్క అలియాస్ ప్రేమ్ విశ్వనాథ్ కనుక రామ్ 19 చిత్రంలో నటిస్తే ఇన్ని రోజులు ఇంట్లో కూర్చొని బుల్లితెరపై చూస్తున్న తమ అభిమాన నటి వంటలక్కని వెండితెరపై చూడటానికి థియేటర్స్ కి పెద్ద ఎత్తున క్యూ కట్టిన కట్టొచ్చు బుల్లితెర మహిళ ప్రేక్షక అభిమానులు. ఈ చిత్రంలో రామ్ కి తల్లి పాత్రలో నదియా కూడా నటించబోతున్నట్లు తెలుస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story