Karthik Subbaraj: రామ్ చరణ్ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కార్తీక్ సుబ్బరాజ్

Karthik Subbaraj: రామ్ చరణ్ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కార్తీక్ సుబ్బరాజ్

admin1
Updated on: 9 Feb 2022 10:00 PM IST
Karthik Subbaraj Made Interesting Comments About Ram Charan Movie
X

Karthik Subbaraj: రామ్ చరణ్ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కార్తీక్ సుబ్బరాజ్

Karthik Subbaraj: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా మార్చ్ 25 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ఆచార్య సినిమాతో కూడా బిజీగా ఉన్న రామ్ చరణ్ త్వరలోనే శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాని మొదలు పెట్టబోతున్నారు. శంకర్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొదటి సినిమా ఇది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కథను అందించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

"శంకర్ సార్ సినిమాకి నేను కథను అందించడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ పొలిటికల్ సినిమాలలో "ముదల్వన్ (ఒకే ఒక్కడు)" కూడా ఒకటి. అలాంటి సినిమాకి దర్శకత్వం వహించిన శంకర్ సార్ నేను రాసిన కథ బాగుంది అనడం ఆ కథని సినిమాగా తీయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చారు కార్తీక్ సుబ్బరాజ్. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అంజలి మరియు జయరామ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story