Sardar Movie: 'సర్దార్' గా రానున్న కార్తీ

First Look of Karthi and Raashi Khannas Sardar Movie Released | Karthi New Movie
x

'సర్దార్' గా రానున్న కార్తీ (ఫొటో ట్విట్టర్)

Highlights

Sardar Movie: కార్తీ ఇటీవల నటించిన సినిమా సుల్తాన్. భారీ అంచనాలతో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద ఎటువంటి ముద్ర వేయలేకపోయింది.

Sardar Movie: కార్తీ ఇటీవల నటించిన సినిమా సుల్తాన్. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఎటువంటి ముద్ర వేయలేకపోయింది. ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఫ్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం కార్తీ ఒక ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అది కూడా ఒక ప్రయోగాత్మక చిత్రం అని తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ లో వచ్చిన తాజా నివేదికల ప్రకారం, కార్తీ నటించనున్న ఈ చిత్రం పేరు 'సర్దార్' అని పెట్టారంట.

పీఎస్ మిత్రాన్ ఈ చిత్రానికి దర్శకుడిగా పనిచేయనున్నారు. ఈ మేరకు ఫిల్మ్ యూనిట్ ఈ రోజు మోషన్ పోస్టర్‌ను విడుదల చేసి, టైటిల్ ను ప్రకటించింది. వచ్చే రెండు రోజుల్లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో రాశి ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిచనున్నాడు. జార్జ్ సీ విలియమ్స్ ఛాయాగ్రాహకుడుగా పనిచేస్తన్నారు. అలాగే కె. కధీర్ ఆర్ట్ డైరెక్టర్ గా, రూబెన్ ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేయనున్నారు. ఎస్.లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories