Sulthan Trailer: రష్మిక చూపులతోనే చంపేస్తుందంటోన్న కార్తి

Karthi Rashmika Mandanna Starrer Sulthan Telugu Trailer Released
x

రష్మిక మందన్న, కార్తి (ఫొటో యూట్యూబ్)

Highlights

Sulthan Trailer: కార్తి, రష్మిక మందన్న కాంబో లో వస్తున్న చిత్రం ‘సుల్తాన్‌’. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Sulthan Trailer: కార్తి, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సుల్తాన్‌'. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన టీజర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. తాజాగా సుల్తాన్ ట్రైలర్ ను విడుదలయింది. పక్కా మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో అలరించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో రష్మిక అచ్చం పల్లెటూరీ అమ్మాయిలా కనిపించనుంది. రౌడీలయితే భయపడాలా ? అంటూ హీరోయిన్ రష్మిక చెప్నిన మాటలు ఆకట్టుకున్నాయి. అలాగే 'వందమంది రౌడీలను మేనేజ్‌ చేస్తున్నాను.. ఇది చూపులతోనే చంపేస్తుంది' అంటూ కార్తి చెప్పే డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ గా ఉంది. 100 మంది రౌడీలు ఉన్న ఓ స్థానంలోకి కథనాయకుడు వెళ్తాడు. వాళ్లతో కలిసిపోయి.. వారిని ఎలా మార్చాడు అనేది ఈ సినిమా కథ.

ఈ చిత్రానికి వివేక్‌ మెర్విన్‌ సంగీతం అందిస్తున్నాడు. సీనియర్ నటుడు నెపోలియన్, లాల్, యోగిబాబు, కేజీఎఫ్ తదితరులు నటించారు. సుల్తాన్ సినిమా ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories