Karthi: సర్దార్ మూవీ టీమ్ సభ్యులకి హీరో కార్తీ ఊహించని గిప్ట్..

Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన "సర్దార్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 9 Dec 2022 12:22 PM IST
Karthi Gifts Silver Bottles To Sardar Team
X

Karthi: సర్దార్ మూవీ టీమ్ సభ్యులకి హీరో కార్తీ ఊహించని గిప్ట్..

Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన "సర్దార్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ డ్యూయల్ రోల్ లో కనిపించిన ఈ సినిమా తమిళ్ లో మాత్రమే కాక తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను అందుకున్న ఈ సినిమాలో కార్తీ ఒక మాజీ రా ఏజెంట్ గా కనిపించారు. అతని అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో లైలా, రజిషా విజయన్, చంకీ పాండేలు ముఖ్యపాత్రలలో కనిపించారు.

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లను వాడటం వచ్చేతరాలకు ఎంత ప్రమాదకరమో ఈ సినిమాలో చూపిస్తారు. ఇక కథ మొత్తం కూడా దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక సినిమా సూపర్ హిట్ అయినా కారణంగా కార్తీ 30000 పెట్టి చిత్ర బృందానికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక క్రియేటివ్ గిఫ్ట్ కూడా ఆలోచించారు.

అదే సిల్వర్ వాటర్ బాటిల్. చిత్ర బృందంలోని ప్రతి ఒక్కళ్ళకి కార్తీ ఒక కాస్ట్లీ సిల్వర్ వాటర్ బాటిల్ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈ వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక కార్తీ త్వరలోనే "పొన్నియిన్ సెల్వన్ 2" షూటింగ్లో పాల్గొనబోతున్నారు. అంతేకాకుండా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ సినిమాకి సీక్వెల్ అయిన "ఖైదీ 2" లో కూడా నటించబోతున్నారు. ఇక ఇప్పటికే చిత్ర బృందం "సర్దార్" సినిమాకి కూడా సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story