Khaidi-2 Movie: "ఖైదీ 2" సినిమా పై క్లారిటీ ఇచ్చిన కార్తీ

Karthi Confirms Kaithi 2 Movie
x

Khaidi-2 Movie: "ఖైదీ 2" సినిమా పై క్లారిటీ ఇచ్చిన కార్తీ

Highlights

Kaithi 2: కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ "ఖైదీ" సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.

Kaithi 2: కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ "ఖైదీ" సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించిన లోకేష్ ఆ తర్వాత కమల్ హాసన్ హీరోగా "విక్రమ్" సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నారు. అయితే "ఖైదీ" మరియు "విక్రమ్" సినిమాలను కలుపుతూ ఒక సినిమాటిక్ యూనివర్స్ కూడా క్రియేట్ చేశారు.

అయితే తాజాగా "ఖైదీ" సినిమాకి సీక్వెల్ గా "ఖైదీ 2" కూడా తెరక్కనుంది. "ఖైదీ" సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ సినిమా కూడా ఎలా ఉండబోతోంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా తన "పొన్నియిన్ సెల్వన్" సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కార్తీ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. "ఖైదీ 2" సినిమా "ఖైదీ" సినిమా కంటే 10 రెట్లు ఎక్కువ బడ్జెట్ తో ఉంటుందని చెప్పి షాకిచ్చారు కార్తీ.

గతంలో లోకేష్ కనగరాజ్ కూడా సినిమా గురించి మాట్లాడుతూ, "ఢిల్లీ (సినిమాలో కార్తీ పాత్ర పేరు) మంచి కబడ్డీ ప్లేయర్. జైల్ లో కూడా ఎన్నో అవార్డులు గెలుచుకుంటాడు. దీని గురించి మొదటి భాగంలో నేను పెద్దగా చూపించలేదు. కానీ రెండవ భాగం లో ఢిల్లీ పాత్ర గురించి మరింత ఎక్స్ప్లోర్ చేస్తాను" అని అన్నారు లోకేష్ కనగరాజ్. దీంతో సినిమాపై అభిమానుల అంచనాలు రెట్టింపు అయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories