Prabhas: ప్రభాస్ సర్‌ప్రైజ్‌ కి ఫిదా అయినా బాలీవుడ్ హీరోయిన్

Prabhas: ప్రభాస్ సర్‌ప్రైజ్‌ కి ఫిదా అయినా బాలీవుడ్ హీరోయిన్
x
కరీనా కపూర్ అండ్ ప్రభాస్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Prabhas: ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన కరీనా కపూర్

Prabhas: బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరుస భారీ బడ్జెట్ సినిమాలతో ప్రభాస్ బిజీగా మారిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల చేస్తూ రికార్డును సృష్టించబోతున్నారు. అయితే స్టార్ హీరోగా మారినప్పటికీ ప్రభాస్ తన ఆతిథ్యం విషయంలో ఏమాత్రం లోటు చేయరు. ప్రభాస్ ఆతిథ్యం గురించి ఇప్పటికే చాలా సెలబ్రిటీలు గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే. తనతో నటించే వారికి తమ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ని పంపటం ప్రభాస్ కి చాలా ఇష్టం.

ఇప్పటికే ప్రభాస్ తో నటించిన శృతిహాసన్, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు ప్రభాస్ సర్ప్రైజ్ ల గురించి చాలా గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ మరొక బాలీవుడ్ బ్యూటీకి బిర్యాని పంపించారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్. ఈ అద్భుతమైన రుచికరమైన భోజనానికి తాను ఫిదా అయ్యానని కరీనా కపూర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ కు ధన్యవాదాలు చెప్పారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ఆది పురుష్" సినిమాలో కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories