Koffee With Karan: "ఆ ఇద్దరినీ నా షో కి తీసుకురాలేను," అంటున్న కరణ్ జోహార్

Koffee With Karan: ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ చాలా కాలంగా "కాఫీ విత్ కరణ్" అనే ఒక సెలబ్రిటీ టాక్ షో ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 28 Aug 2022 4:04 PM IST
Karan Johar Reveals the two celebs he will Never Invite on Koffee With Karan
X

Koffee With Karan: "ఆ ఇద్దరినీ నా షో కి తీసుకురాలేను," అంటున్న కరణ్ జోహార్

Koffee With Karan: ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ చాలా కాలంగా "కాఫీ విత్ కరణ్" అనే ఒక సెలబ్రిటీ టాక్ షో ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఈ మధ్యనే ఏడవ సీజన్ కూడా మొదలు పెట్టింది. బాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాక సౌత్ ఇండియన్ స్టార్స్ కూడా ఈ షోలో కనిపించడానికి క్యూ కడతారు. కరణ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం అని కొందరు బహిరంగంగానే చెబుతూ ఉంటారు.

ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీ నుంచి ప్రభాస్, రానా, రాజమౌళి, సమంత వంటి స్టార్లు కాఫీ విత్ కరణ్ షోలో కనిపించారు. అయితే ఇద్దరు సెలబ్రిటీలను మాత్రం తాను ఎప్పటికీ షో కి తీసుకురాలేను అని చెబుతున్నారు కరణ్ జోహార్. అందులో మొదటిది ప్రముఖ హీరోయిన్ రేఖ.

"సీనియర్ స్టార్ హీరోయిన్ రేఖ గారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె నన్ను చాలా ఇష్టపడతారు. అయినా కూడా నేను ఆమెని షో కి తీసుకురావడంలో విఫలమయ్యాను" అని ఒప్పుకున్నారు కరణ్ జోహార్. యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా గురించి మాట్లాడుతూ "ఆయన నాకు గురువు లాంటివారు. ఆయనే నాకు మార్గదర్శకుడు. అటువంటి ఆయనను నేను షో కి ఆహ్వానిస్తే ఖచ్చితంగా నో చెప్తారని నాకు తెలుసు. అందుకే నేను ఆయన్ని ఎప్పుడూ ఆహ్వానించలేదు," అని అన్నారు కరణ్ జోహార్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story