Kantara: ఆస్కార్‌ బరిలో కాంతారా మూవీ.. రెండు విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌

Kantara Movie Qualified two Categories In Oscar Awards
x

Kantara: ఆస్కార్‌ బరిలో కాంతారా మూవీ.. రెండు విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌

Highlights

Kantara: బెస్ట్‌ మూవీ, బెస్ట్‌ యాక్టర్‌ అవార్డులకు ఎంపిక.. ట్విట్టర్‌లో ప్రకటించిన కాంతారా మూవీ టీమ్‌

Kantara: ఆస్కార్‌ బరిలో కాంతారా మూవీ నిలిచింది. రెండు విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. బెస్ట్‌ మూవీ, బెస్ట్‌ యాక్టర్‌ అవార్డులకు ఎంపికైంది. ఈ విషయాన్ని కాంతార మూవీ టీమ్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. గత ఏడాది సంచలన విజయం సాధించిన సినిమాలలో కన్నడ మూవీ 'కాంతార' ఒకటి. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ముందుగా కన్నడలో విడుదలై ఆ తర్వాత పలు భాషల్లో రిలీజై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. కేజీఎఫ్ సిరీస్‌ను నిర్మించిన హోంబలే సంస్థ 'కాంతార' మూవీని నిర్మించింది. రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories