Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్‌ 1’ ట్రైలర్ విడుదల.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న రిషబ్ శెట్టి నటన..!

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్‌ 1’ ట్రైలర్ విడుదల.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న రిషబ్ శెట్టి నటన..!
x
Highlights

Kantara Chapter 1: 2022లో సంచలనం సృష్టించిన ‘కాంతార’ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

Kantara Chapter 1: 2022లో సంచలనం సృష్టించిన ‘కాంతార’ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. దానికి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార చాప్టర్‌ 1’ ట్రైలర్‌ను తాజాగా సూపర్‌స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ట్రైలర్ హైలైట్స్:

ట్రైలర్‌లో రిషబ్ శెట్టి తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. రుక్మిణి వసంత్ మహారాణి పాత్రలో కనిపించి మెప్పించారు. గూస్‌బంప్స్‌ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

‘కాంతార’ విజయం తర్వాత, దాని ప్రీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచి, సినిమా విజయం ఖాయమని సంకేతాలు ఇస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories