Box Office: "పుష్ప" రికార్డులు బ్రేక్ చేసిన "కాంతార"...!

kantara breaks pushpa records
x

 "పుష్ప" రికార్డులు బ్రేక్ చేసిన "కాంతార"

Highlights

* మంచి టాక్ తో స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ తో కూడా బాగానే వసూళ్లు చేస్తోంది

Block Buster Kantara: కన్నడలో రిషబ్ శెట్టి హీరోగా నటించిన "కాంతార" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కేవలం కన్నడలో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా "పుష్ప: ది రైజ్" కలెక్షన్లను దాటేసాయి. విడుదలైన మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటూ కలెక్షన్ల పరంగా కూడా అదే జోరుతో దూసుకెళ్లిన ఈ సినిమా ఈ మధ్యనే 350 కోట్ల మార్కుని దాటేసింది. దీంతో అల్లు అర్జున్ "పుష్ప: ది రైజ్" సినిమా కలెక్షన్లను కూడా "కాంతార" బ్రేక్ చేసింది. ప్రస్తుతం "కాంతార" 400 కోట్ల మార్పుని చేరెందుకు ముందుకు దూసుకు వెళుతోంది.

రిషబ్ శెట్టి ఈ సినిమాకి స్వయంగా దర్శకత్వం కూడా వహించారు. ఒకవైపు కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా మరోవైపు మంచి టాక్ తో స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ తో కూడా బాగానే వసూళ్లు చేస్తోంది. కిషోర్, అచ్యుత్ కుమార్, మరియు సప్తమి గౌడలు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో త్వరలో విడుదల కాబోతోంది. నిజానికి ఈ సినిమా నవంబర్ 4వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కావాల్సి ఉంది కానీ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ఓటీటీ విడుదలను వాయిదా వేయడం జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories