ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటూ ప్రాణాలు కోల్పోయిన కన్నడ నటి

Chethana Raj: ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలి అంటే నటనతో పాటు అందం కూడా చాలా ముఖ్యం అని కొందరు హీరోయిన్లు గట్టిగా నమ్ముతారు.

Arun Chilukuri
Published on: 17 May 2022 8:39 PM IST
Kannada TV Actress Chethana Raj Dies During Plastic Surgery
X

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటూ ప్రాణాలు కోల్పోయిన కన్నడ నటి

Chethana Raj: ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలి అంటే నటనతో పాటు అందం కూడా చాలా ముఖ్యం అని కొందరు హీరోయిన్లు గట్టిగా నమ్ముతారు. అదేవిధంగా సౌందర్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఇప్పటికే పలువురు హీరోయిన్లు శస్త్ర చికిత్సలు కూడా చేయించుకున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే కొన్ని అనుకోని పరిస్థితులవల్ల కొందరు హీరోయిన్లు తమ ప్రాణాలు సైతం కోల్పోయారు. సన్న పడే క్రమంలో ఆపరేషన్ చేయించుకున్న ఆర్తి అగర్వాల్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా తన అందానికి మెరుగులు దిద్దుకునే క్రమంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అనుకున్న ఒక కన్నడ హీరోయిన్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది.

ఆమె చేతన రాజ్. కన్నడ టీవీ సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్న చేతన రాజ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత కొద్ది రోజుల్లోనే అస్వస్థతకు గురైంది. ఊపిరితిత్తుల్లో ద్రవాలు ఎక్కువగా చేరడంతో చేతన రాజ్ మరణించింది. ఆమె మరణం కన్నడ ఇండస్ట్రీని కుదిపేసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలు అడ్వర్టైజ్ మెంట్స్ లో కూడా నటించి పేరు తెచ్చుకున్న చేతన రాజ్ బెంగళూరు రాజాజీ నగర్ లోని శెట్టి కాస్మెటిక్ సెంటర్ లో ఫ్రీ ఫ్యాట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. కన్నడ టీవీ మరియు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఆమె మరణానికి సంతాపాన్ని తెలియజేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story